telugu navyamedia
రాజకీయ వార్తలు

సచిన్ పైలట్ వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court

కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్‌తో పాటు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్థాన్ హైకోర్టును నిలువరించలేమని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి భారీ ఊరట లభించినట్టయింది.

సచిన్ పైలట్ పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించేందుకు సుప్రీం అనుమతినిచ్చింది. మరోవైపు ఈ విషయాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకు బదిలీ చేయాన్న స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడానికి దారి తీసిన కారణాలను తెలపాలంటూ స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం వివరణ కోరింది.

Related posts