telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 తగ్గి రూ. 48,220 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 190 తగ్గి రూ. 44,200 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,880 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. 42,050 పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 1,800 తగ్గి రూ. 70,000 కి చేరింది.

Related posts