telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పీఆర్సీ ప్రకటన సీఎం కేసీఆర్‌కు ఇష్టమే లేదు…

Raghunandan

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… 2017లో ఇవ్వాల్సి ఉన్న పీఆర్సీని ఇప్పుడు ఇస్తూ ఎదో చేసినట్టు గొప్ప చెప్పుకుంటున్నారన్న ఆయన.. బీజేపీ ఒత్తిడి వల్లే పీఆర్సీ వచ్చిందని.. పీఆర్సీ ప్రకటన సీఎం కేసీఆర్‌కు ఇష్టమే లేదు అని తెలిపారు. కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో లబ్ది పొందేందుకు పీఆర్సీ ప్రకటించారు ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ గురించి గొప్పలు చెప్పుకొనే మీరు అందులో పని చేసిన ఉద్యోగులను తీసేసారన్న రఘునందన్.. నిరుద్యోగ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ఉద్యోగ భర్తీలు చేయాలని సూచించారు.. టీఎస్పీఎస్సి చైర్మన్ ని నియమించేందుకు సీఎంకి 5 నెలలుగా సమయం దొరకడం లేదని సెటైర్లు వేసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఉద్యోగులను వంచించడానికీ జరిగిన కుట్ర పీఆర్సీ అన్నారు. అలాగే మంత్రి హరీష్ రావు మాటలను విమర్శించారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదన్న ఆయన.. సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం అని చట్టంలో ఉందని చెప్పుకొచ్చారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడమే కారణమని ఆరోపించారు.

Related posts