telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిత్తూరు జిల్లాలో ఐదు దేవాలయాల పాలకమండళ్ల రద్దు

srisailam temple

చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు మొత్తం ఐదు ఆలయాల పాలక మండళ్లను రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రద్దయిన వాటిలో తలకోన సిద్ధేశ్వరాలయం, సురుటుపల్లె పల్లికొండేశ్వరాలయం, నగరి దేశమ్మ ఆలయం, కుప్పంలోని శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాల పాలక మండళ్లు ఉన్నాయి.

అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లోనూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు యాభై శాతం స్థానాలు కేటాయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పాలక మండళ్ల నియామకం జరిగిపోవడంతో ఈ నిబంధన అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి స్థానంలో కాణిపాకం మినహా మిగిలిన ఆలయాలకు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts