telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాభిమానులు మనసులు దోచుకుంటున్న సుధాకర్ కోమాకుల!!

Sudhakar

‘అనుకరణ అన్నిటికంటే అతి పెద్ద అభినందన’ (Imitation is the best form of flattery) అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఏడాది తన 65వ పుట్టిన రోజుకు మెగాస్టార్ చిరంజీవి అందుకున్న అన్ని బర్త్ డే గిఫ్ట్ ల కంటే… యువ కథానాయకుడు సుధాకర్ కోమాకుల అందించిన గిఫ్ట్.. ‘బెస్ట్ బర్త్ డే గిఫ్ట్’ అని అందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.

చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన మూవీస్ లో ఒకటైన ‘ఛాలెంజ్’లో అల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ‘ఇందువదన కుందరదన.. ఐ లవ్ యు ఓ హారిక… నీ ప్రేమకే జోహరిక’ పాటను.. తన శ్రీమతి హారికతో కలిసి సుధాకర్ కోమాకుల చేసిన ‘డాన్స్ రీ-క్రియేషన్’ మెగాభిమానుల మనసు దండిగా దోచుకుంటోంది.

శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై… ‘కుందనపు బొమ్మ, ఉందిలే మంచికాలం ముందు ముందునా, నువ్వు తోపురా’ (NTR) చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న సుధాకర్ కోమాకుల… ‘ఇందువదన..’ పాటకు వస్తున్న స్పందనకు ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు.

‘స్వతహా మెగాస్టార్ కు వీరాభిమానినయిన తాను…తన బెటర్ హాఫ్ నిహారిక పేరు కలిసొచ్చేలా… ఈ పాటను ఎంపిక చేసుకున్నానని… ఐ ఫోన్ లో.. ట్రైపాడ్ ఉపయోగించి, తన మిత్రుడు జార్జ్ సంపర సహకారంతో చిత్రీకరించిన ఈ పాటకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని’ సుధాకర్ అంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాటను… ఆదిత్య మ్యూజిక్ (ఛాలెంజ్ ఆడియో హక్కుదార్లు) తమ అఫీషియల్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం గమనార్హం. మెగాభిమానులతోపాటు సినీ సంగీతాభిమానులందరి మనసులు హోల్ సేల్ గా దోచుకుంటున్న ఈ పాట… మెగాస్టార్ ను త్వరలోనే చేరుతుందని.. సుధాకర్-నీహరికలకు మెగా కాల్ రావడం ఖాయమంటూ వెలువడుతున్న అంచనాలు నిజం కావాలని కోరుకుందాం!!

Related posts