telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అభ్యర్థులను భయపెట్టేందుకే కేసులు : సోమువీర్రాజు

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. అధికార వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పోతున్నాయి. నామినేషన్లు వేయకూడదని బెదిరింపులకు కూడా దిగుతున్నారు మరి కొందరు నాయకులు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి.  ఇది ఇలా ఉండగా వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నిప్పులు చెరిగారు. ఎలక్షన్‌ కమిషన్‌ను పోటీ పార్టీగా.. వైసీపీ భావిస్తోందని సోమువీర్రాజు పేర్కొన్నారు. పంచాయతీ అభ్యర్థులను భయపెట్టేందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీకి నిధులు కేటాయించలేదని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు సోము వీర్రాజు. ఏపీలో గృహనిర్మాణాలకు రూ. 28 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని.. కేంద్ర నిధులతో భవనాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం విడ్డూరమని తెలిపారు. వైసీపీ విధానాల వల్ల విద్యావ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతుందని సోమువీర్రాజు మండిపడ్డారు. 

Related posts