కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బండి సంజయ్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లగా చిరంజీవి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
శాలువాతో సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
తాను విద్యార్థి దశలో చిరంజీవి సినిమాలు అభిమానని సంజయ్ మెగాస్టార్ తో అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం వారిద్దరు జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.