telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా

NBK

జూన్ 10 వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఆ రోజున బాలయ్య 60 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 60వ సంవత్సరం వేడుకలు కాబట్టి కొంత ప్రత్యేకంగా ఉండే విధంగా ప్లాన్ చేశారు. నందమూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న‌ల్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రానికి సంబంధించి తొలి అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. జూన్ 9 సాయంత్రం 7:09 నిమిషాల‌కు తొలి గ‌ర్జ‌న ఉంటుందంటూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో బాల‌కృష్ణ లుక్‌తోపాటు టైటిల్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఐదున్న‌ర గంట‌ల‌కు బాల‌కృష్ణ పాడిన స్పెష‌ల్ సాంగ్‌ను కూడా అభిమానుల కోసం విడుద‌ల చేయ‌బోతున్నారు. అంటే బాల‌య్య అభిమానుల‌కు ఈ రోజు డ‌బుల్ ధ‌మాకా ఉండ‌బోతుంది.

Related posts