telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భీష్మ : ఆకట్టుకుంటున్న “సరాసరి” లిరికల్ వీడియో సాంగ్

Bheeshma

నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మరో సాంగ్ “సరాసరి” లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘సరాసరి’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.

Related posts