telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహాపాదయాత్రకు ఒంగోలులో సంఘీభావ ప్రదర్శన

అమరావతి రైతుల చేపట్టిన మహా పాదయాత్రకు ఒంగోలు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి సంఘీభావప్రదర్శన నిర్వహించింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి అద్దంకి బస్ స్టాండ్ బాపూజీ కాంప్లెక్స్ దాకా అమరావతి నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. అమరావతి రాజధాని కోసం 30 వేలు ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని రైతులు గుర్తుచేశారు.

రాజధాని నిర్మాణపనులకోసం అమరావతితో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తే విలువలేకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానుల పేరుతో పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి ఏర్పాటుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసివిషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా దీక్షలు చేపట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఒంగోలులో సంఘీభావ ప్రదర్శన నిర్వహించామని ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు తెలిపారు. మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అనే నినాదాలు హోరెత్తించారు.

Related posts