టీమింయాకు ఆడటం.. కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడం ఒక ఎత్తైతే… అన్నిఫార్మాట్లల్లో కెప్టెన్ గా బాధ్యతతో ఆడానని, అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించానని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. టీ20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పించుకోవాలని తీసుకున్న నిర్ణయం వివప్లవాత్మక మార్పుగా భావించానని మనసులోమాటను చెప్పుకొచ్చారు.
టీమిండియా వన్డే కెప్టెన్సీనుంచి బీసీసీఐ తప్పించిన తర్వాత ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. టెస్టు జట్టును ప్రకటించేందుకు గంటన్నర ముందుగా సెలెక్టర్లు సమాచారమందించారని తెలిపారు. టీ20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే, టెస్టు క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తాని బీసీసీఐకి విన్న వించిన విషయాన్ని ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.
క్రికెట్లో తన నిర్ణయాలు, చర్యలు టీమిండియా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉండవని కోహ్లీ చెప్పుకొచ్చారు. కెప్టెన్సీనుంచి తప్పించడంలో బీసీసీఐ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలనని తెలిపారు. ఆటగాడిగా… కెప్టెన్ గా టీమిండియాను సరైన దిశలో నడిపించగలిగాననే అభిప్రాయం వ్యక్తంచేశారు.
రోహిత్ సమర్థత గలిగిన ఆటగాడని, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కలసి జట్టును ముందునడిపిస్తారనే విశ్వాసం వ్యక్తంచేశారు. టీ20లోనూ, వన్డేల్లోనూ తనవంతు బాధ్యతగా సహకరిస్తామన్నారు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాల్లేవని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.