telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నా రాజకీయ జీవితం ముగిసింది..కానీ టీడీపీకే మా స‌పోర్ట్‌

రాజకీయ జీవితంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడారు

తన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని వెల్లడించారు.. నేను చేయని పదవి లేదు.. చూడాని రాజకీయం లేదు. నా సంకల్పమే నా భవిష్యత్తు అని అన్నారు.

రాజ‌కీయాల‌కు తాను దూరంగా ఉన్నా త‌న‌కు అనుచ‌ర వ‌ర్గం ఉంద‌ని, అయితే నా అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని అన్నారు. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చ‌ని అన్నారు.టీడీపీకి పెద్ద దిక్కు చంద్రబాబే అని, త‌న‌లాంటి వాళ్ళు కాద‌ని గ‌ల్లా అరుణ‌కుమారి తెలిపారు.

గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీలో ఉన్నాడు కాబ‌ట్టి ..తాము ఆయ‌న‌కే స‌పోర్ట్ చేస్తామ‌ని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ వద్దనుకున్నాను. అందుకే సైలెంట్‌గా ఉన్నానని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు.

Related posts