telugu navyamedia
సినిమా వార్తలు

మీతో సినిమా చేస్తే హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారా?

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నంద‌మూరి బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో కు హోస్ట్‏గా వ్య‌వ‌హారిస్తున్న సంగ‌తి తెలిసిందే..ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ప్రశ్నలను సందిస్తూ.. గేమ్స్‏తో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి.. బాలకృష్ణ అ’న్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ టాక్ షోలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు అభిమానుల్ని అలరిస్తోంది.

‘మీరు ఇంటెలిజెంట్​, అచీవర్​ అని అందరికీ తెలుసు.. మరి ఎందుకు ఈ తెల్ల గడ్డం, ఇప్ప‌టి దాక మన కాంబినేషన్ ప‌డ‌లేదు. నా అభిమానులు బాల‌య్య‌తో సినిమా ఎప్పుడు చేస్తారు అని నిన్ను అడిగారు.​ మీ స‌మాధానం ఏంటి అస‌లు? అని బాలయ్య అడగ్గా ..సీరియస్ లుక్ ఇచ్చారు జక్కన్న..

rajamouli keeravani Unstoppable with nbk

మీతో సినిమా చేస్తే హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారా? ఆ తర్వాత రెండు సినిమాలు ఫసకేగా’ అని రాజమౌళిని బాలయ్య అడిగారు. దీనికి ప్రతిగా సమాధానాలన్నీ ఎపిసోడ్​లోనే చెబుతానంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

 

కాగా.. బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. థియేటర్లలో అఖండ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 10 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీసు దుమ్మురేపారు.

మరోవైపు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇందులో రామ్​చరణ్ , యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ ప్ర‌ధాన‌పాత్ర‌లో నటించారు.

Related posts