telugu navyamedia
తెలంగాణ వార్తలు

జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలుచేసేందుకు చర్యలు చేపట్టారు. తొలుత ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లోనూ, అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమై సుధీర్ఘంగా చర్చించబోతున్నారు.

తెలంగాణ భవన్ లో ఈ నెల 18న (శుక్రవారం) జరిగే పార్టీ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు హాజరుకాబోతున్నారు.

అలాగే మరుసటిరోజు ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దళిత బంధు అమలుపై ప్రత్యేకంగా చర్చించబోతున్నారు.

Related posts