telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు నేడు హాజరు అయ్యారు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరు అయ్యారు.

ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ఉన్నారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రసంగం సమయంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

ఈ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరు అయ్యారు. 2024-25 ఆర్థిక బడ్జెట్ ను అసెంబ్లీలో మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.

Related posts