telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మోసగాళ్లు సినిమా నుండి అప్డేట్…

Mosagallu

మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణు స్టార్ హీరోయిన్ కాజల్ అన్న చెల్లెలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసినిమాను జాఫ్రీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో  తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు సోదరి పాత్రలో నటించనున్నారు. ఇద్దరు కలిసి స్కామ్ చేయనున్నారంట. ఇక ఇతర నటుల విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా నవదీప్, సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళీ, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి సరికొత్త ట్యూన్‌లో పాట విడుదల కానుందంట. ఈ పాట లిరికల్ వీడియోను రేపు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాట ‘డబ్బే మనది కుమ్మేస్కో’ అంటూ సాగనుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఈ సినిమా విడుదల తర్వాత ఏం జరుగుతుంది అనేది.

Related posts