telugu navyamedia
సినిమా వార్తలు

సెన్సార్ సమస్యల్లో కాజల్ సినిమా

Paris-Paris

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ “క్వీన్” తమిళ రీమేక్‌ “పారిస్ పారిస్”లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిత్ర షూటింగ్ చాన్నాళ్ళ క్రిత‌మే పూర్తికాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. అయితే కాజ‌ల్ న‌టించిన “పారిస్ పారిస్” చిత్రం ఇటీవలే సెన్సార్‌కి వెళ్ల‌గా, సెన్సార్ స‌భ్యులు దీనిపై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. బూతు ప‌దాలు, బోల్డ్ విజువ‌ల్స్ ఉండ‌డంతో వాటిని తొల‌గించ‌డంతో పాటు కొన్నింటిన బ్ల‌ర్ చేయాల‌ని చిత్ర యూనిట్‌కి సీబీఎఫ్‌సీ సూచించింద‌ట‌. దీనిపై చిత్ర బృందం సెన్సార్ క్లియ‌రెన్స్ కోసం రివైజింగ్ క‌మీటిని క‌ల‌వనున్నారు. మెడియంటే ఫిలింస్ బేన‌ర్‌పై మ‌ను కుమార‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “క్వీన్” చిత్రం సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ కాగా, హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషించారు. “క్వీన్” రీమేక్ చిత్రం కన్నడలో “బటర్ ఫ్లై” అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో “పారిస్ పారిస్”, మలయాళంలో “జామ్ జామ్”, తెలుగులో “దటీజ్ మ‌హాల‌క్ష్మీ” అనే టైటిల్స్ తో రూపొందుంది. తెలుగు వ‌ర్షెన్‌ని అ చిత్ర ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌గా, కన్న‌డ వ‌ర్షెన్‌ని ర‌మేష్ అర‌వింద్‌, త‌మిళ వ‌ర్షెన్‌ని కూడా రమేష్ అరవింద, మ‌ల‌యాళ వ‌ర్షెన్‌ని నీల‌కంఠ‌ తెర‌కెక్కించారు.

Related posts