శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘ఫిదా’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. మలయాళ అమ్మాయి అయిన తొలి సినిమాతోనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని నిజంగానే హైబ్రీడ్ పిల్ల అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకుంది. ‘ఫిదా’ సినిమాలో ట్రాక్టర్ నడిపే సన్నివేశం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ట్రాక్టర్ తోలే సీన్ తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని చెప్పుకొచ్చింది. ట్రాక్టర్‌ను మాములుగా నేర్చుకుని రోడ్డుపై నడపడం వేరు. దమ్ము వీల్స్ బురుద చేనులో ట్రాక్టర్ నడపడం వేరు. ఈ సమయంలో అలా ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావనలతో నటించడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సీన్ చేసే సమయంలో నన్నునేను నియంత్రణ కోల్పాయానంది. నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన రోజులను గుర్తు చేసుకుంది.
previous post
next post
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా