telugu navyamedia
Uncategorized

జమ్ముకశ్మీర్ అంశాన్నిఅగ్ర రాజ్యాలకు వివరించిన భారత్

UNO five countries

ఆర్టికల్ 370ని రద్దు చేసే బిల్లును నిన్న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ లో మారుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే దేశాలకు జమ్ముకశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగ శాఖ వివరించింది. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను ఆయా దేశాల రాయబారులకు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో జమ్ముకశ్మీర్ లో సుపరిపాలన, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రతినిధి స్పందిస్తూ నియంత్రణ రేఖ వద్ద శాంతి, సుస్థిరతలకు ఇరు దేశాలు కృషి చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మాట్లాడుతూ, కశ్మీర్ పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts