telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ భేటీ :భూమన కరుణాకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పెగాసస్ వ్యవహారం ఏపీలో మరోసారి తెరపైకి వచ్చింది. గత టిడిపి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ వాడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నిజా నిజాలు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది..

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ అధ్యక్షతన పెగాసస్ కొనుగోలుకు సంబంధించి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్నిసేకరిస్తున్నారు.

ఈ సమావేశం అనంతరం హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన మాట్లాడుతూ… గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారని.. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు.

House Committee Inquiry Pegasus led by Bhumana Karunakar Reddy - Sakshi

అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం.రాబోయే సమావేశాల్లో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేయకపోవచ్చని.. కానీ అప్పటి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు అడ్డ దారుల్లో చేశారన్నారు. పెగసస్ మాత్రమే కాదు, ఇతర అన్ని అంశాలపై విచారణ చేస్తామన్నారు. వచ్చే నెల మళ్ళీ జులై 5, 6 తేదీల్లో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

 

Related posts