నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగ్ రాయ్’ . రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసీగా, కృతి శెట్టి మోడ్రన్ అమ్మాయిగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ భాషలలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది.
తాజాగా ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సీన్‌లో వేశ్యలందరినీ ఒక చోట కూర్చోబెట్టిన శ్యామ్ సింగరాయ్ .. వారిపై తను రాసిన లేఖను చదివి వినిపిస్తుంటారు. అందులో ఒక వేశ్య.. ‘ఇంత తెలిసిన వాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడుగుతుంది.
దానికి ‘శ్యామ్ సింగ రాయ్’ ఇచ్చిన సమాధానం చూసి తీరాల్సిందే. “ఖచ్చితంగా చేసుకుంటాను…నేను నిన్ను ప్రేమించిన రోజు” అంటూ శ్యామ్ సింగ రాయ్ బదులిచ్చారు.
ఈ సీన్ థియేటర్లో పడితే ఇంకా బాగుండేదని నాని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిలేటెడ్ సీన్ వైరల్ అవుతోంది.