telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజకీయాలు వద్దు… కమల్, రజినీ రాజకీయ అంశంపై హీరోయిన్ కామెంట్

Oviya,Simbu,90ml Movie allegations

బిగ్‌బాస్‌తో ఇమేజ్‌ పెంచుకున్న యువతార ఓవియాకు అవకాశాలు తగ్గినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీ ఇప్పటికే తమిళంలో ‘కలవాణి’, ‘కాంచన3’, ‘90ఎంఎల్‌’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవల కాలంలో ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ప్రైవేటు కార్యక్రమాలకు ఆమెను అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇటీవలే కోవైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఓవియా అతిథిగా హాజరైంది. ఆ సందర్భంగా ఆమెపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. అప్పుడు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కలిసి రాజకీయాలు చేయాలనుకుంటున్న అంశాన్ని ప్రస్తావించగా, ఓవియా సమాధానాన్ని దాటవేసింది. ఆ తరువాత ఆమె ట్విట్టర్‌లో.. రాజకీయాల్లో లేని తారలు రాజకీయాల గురించి అడగొద్దు అంటూ ఒక ట్వీట్‌ చేసింది. రాజకీయాలపై ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటే వాస్తవాలు బయటకొస్తాయని ఉచిత సలహా కూడా ఇచ్చింది.

Related posts