telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపాస‌న ఫ్యామిలీలో విషాదం

Upasana

టాలీవుడ్ నటుడు రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఉపాస‌న తాత‌య్య కామినేని ఉమాప‌తి రావు మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వ‌య‌స్సు పైబ‌డ‌డం వ‌ల‌న ఆయ‌న తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. తెలంగాణ‌లోని దోమ‌ర‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ఉపాస‌న స‌న్నిహితులు, మెగా అభిమానులు ఉమాప‌తి ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని ప్రార్ధిస్తున్నారు. ఆయ‌న మృతితో ఉపాస‌న భావోద్వేగానికి గురైంది. త‌న సోష‌ల్ మీడియా పేజ్‌ ద్వారా నివాళులు అర్పించింది. మీరంద‌రు క‌న్నీటి ద్వారా కాకుండా చిరున‌వ్వుతో ప్రేమని కురిపించాలంటూ స్ప‌ష్టం చేసింది.

Related posts