వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 3 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో BSC, PG, PHDలో అర్హత ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందుకు రూ.1000 చెల్లించాలి. SC, ST, PW అభ్యర్ధులు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: జులై 5, 2019