హాలీవుడ్ నటి షారోన్ స్టోన్ జీవిత భాగస్వామి కోసం బంబుల్ అనే డేటింగ్ యాప్‌లో ఖాతా తెరిచేశారు. ఈ బంబుల్ అనేది గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రాకు చెందిన యాప్. 2014లో ప్రియాంక చోప్రా ఈ డేటింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఇది కేవలం అమ్మాయిల కోసమే. అబ్బాయిలు పెట్టే రిక్వెస్ట్‌లు అమ్మాయిలు ఓకే చేస్తేనే వారితో డేటింగ్‌కి వెళ్లొచ్చు. కానీ ఈ యాప్‌లో అబ్బాయిలు అమ్మాయిలకు రిక్వెస్ట్‌లు పంపలేరు. ఈ యాప్‌లో షారోన్ ఖాతా తెరవగానే బంబుల్ నిర్వాహకులు కూడా నమ్మలేకపోయారు. ఎవరో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచారని అనుకుని బ్లాక్ చేసేశారు. ఆ తర్వాత షారోన్ ట్విటర్ ద్వారా బంబుల్కి రిక్వెస్ట్ పెట్టింది. ‘యాప్‌లో ఖాతా తెరిచింది నేనే. దయచేసి నన్ను బ్లాక్ చేయకండి’ అని పేర్కొంది. దాంతో బంబుల్ నిర్వాహకులు ఆమె ఖాతాను రీస్టోర్ చేస్తామని చెప్పారు. ఇంకేముంది.. డేటింగ్ యాప్‌లోకి ఓ హీరోయిన్ రావడంతో కుర్రాళ్లంతా పండుగ చేసుకుంటున్నారు. నేను డేటింగ్‌కి తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తానంటూ ట్విటర్లో తెగ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. అయితే బంబుల్ తన ఖాతాను ఇంకా రీస్టోర్ చేయలేదని షారోన్ మళ్లీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన హాలీవుడ్ నటుడు సిమీ లియూ డేట్‌కి వెళ్దామని ప్రపోజ్ చేశాడు. అయితే ఇందుకు షారోన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం షారోన్ వయసు 60 ఏళ్లు. ఈ వయసులో ఓ తోడు కావాలని అనుకుంటున్నారు. అయినా కూడా చాలా మంది నుంచి షారోన్‌కు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి.
previous post