telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఫైర్ వర్క్స్ డీలర్స్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు…

Supreme Court

మన దేశం మొత్తం జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. అయితే మరో నాలుగు రోజుల్లో పండగ దీపావళి పండగ రాబోతున్నది.  అయితే, ఈ ఏడాది దీపావళికి పెద్ద సంఖ్యలో దీపావళి టపాసుల మోత కనిపించదు.  చాలా రాష్ట్రాలు దీపావళి టపాసులపై  ఆంక్షలు విధించాయి.   కొన్ని చోట్ల రెండు గంటలు మాత్రమే కాల్చేందుకు అనుమతి ఇచ్చాయి.  ఇక పశ్చిమ బెంగాల్ లో టపాసులపై అక్కడి హైకోర్టు నిషేధం విధించింది.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు పేర్కొన్నది.  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫైర్ వర్క్స్ డీలర్స్   సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  హైకోర్టు తీర్పుపై ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది.  స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడి హైకోర్టు నిర్ణయం తీసుకొని ఉంటుందని, పండగే కానీ, ప్రజల ప్రాణాలు ముఖ్యం అని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పొల్యూషన్ ను తగ్గించాలని, పండగ వేళ దీపావళి టపాసులు కాల్చడం వలన పర్యావరణంలో  కాలుష్యం పెరిగిపోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాంతో ఫైర్ వర్క్స్ డీలర్స్ కు షాక్ తగిలింది.

Related posts