హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పురపాలక ఎన్నికల దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నీ తోసిపుచ్చిన హైకోర్టు… వార్డుల పునర్విభజన సహా, ఇతర ప్రక్రియకు మళ్లీ షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల పునర్విభజనకు హైకోర్టు సూచించిన మేరకు.. ఏడు రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి, మరో ఏడు రోజుల పాటు వాటి పరిష్కారానికి గడువు విధిస్తూ షెడ్యూల్ ప్రకటించారు.
దీని ప్రకారం రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ముసాయిదాను ఇవాళ ప్రకటించారు. ఈ ప్రకటనను రేపు వార్తా పత్రికల్లో ప్రచురిస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల పరిష్కారానికి ఈనెల 16 వరకు గడువు విధించారు. స్థానిక కౌన్సిల్ లేదా ప్రత్యేక అధికారులు ఆమోదించిన తర్వాత.. ఈనెల 17న పురపాలక వార్డుల పునర్విభజన తుది జాబితా ప్రకటిస్తారు.
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్