telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవికి అమితాబ్ విషెస్… “నా గుడ్ విషెస్ నీకు ఎప్ప‌టికి ఉంటాయి”…!

Amitab Bachchan Tweet on RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ తొలిసారి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో “ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇండో చైనీస్ కొలాబరేషన్ లో నిర్మిత‌మ‌వుతుంది. పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రవిశంకర్ మ్యూజిక్ అందించగా.. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ మూవీని జింగ్ లీ, నరేశ్ టీ, శ్రీధర్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారత్‌లో నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ చిత్రం ఇదేనని చెబుతున్నాడు వర్మ. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ చూసిన మెగాస్టార్ అమితాబ్ వర్మపై ప్రశంసలు కురిపించారు. టీజ‌ర్ లింక్ షేర్ చేస్తూ.. “నా గుడ్ విషెస్ నీకు ఎప్ప‌టికి ఉంటాయి” అని కామెంట్ పెట్టారు బిగ్ బీ. వ‌ర్మ‌, అమితాబ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ చిత్రం ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ ఇలా అరడజనుకు పైగా చిత్రాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన విష‌యం తెలిసిందే. కాగా, ఇండో చైనీస్ చిత్రం ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్ ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

Related posts