telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ఆర్ పెళ్లి కానుక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాం : జగన్

cm jagan ycp

ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ… నంద్యాల ఘటన తనను భాధ కలిగించిందని అన్నారు. ఎక్కడా తన మన బేధం చూపలేదని…ఎవరికైనా న్యాయం ఒకటేనని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాధ్యులైన పోలీసులను అరెస్టు చేశామని…టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న  రామచంద్రరావు అనే లాయర్, బెయిల్ పిటిషన్ వేశారన్నారు. బెయిల్ ను రద్దు చేసేందుకు పై కోర్టుకు వెళ్లామని.. బెయిల్ తప్పకుండా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పలు భాషల్లో  ప్రావీణ్యం ఉన్న అపార మేధావి మౌలానా అబుల్ కలాం ఆజాద్…భారతదేశానికి 1947-58 వరకు ఆజాద్ అందించిన సేవలు ఇప్పటికీ మరచిపోలేమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ ,మైనార్టీ నిరుపేదలు చదువుకునే పాఠశాలలను నాడు నేడు కింద బాగు చేస్తున్నామని..చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కిట్లు ఇవ్వడం సహా సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలో కూడా మంచి భోజనం ఇచ్చేలా మెనూను మార్చామని..పిల్లల బాగోగుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోన్న ప్రభుత్వం తమదేనన్నారు.  రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని..మైనార్టీల అభివృద్ధి కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు, పథకాలు వర్తింపజేస్తున్నామని తెలిపారు.  అన్ని పథకాల ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్దిదారులకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

2020 అక్టోబర్ వరకు మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా  రూ. 3428 కోట్లు అందించామని..వీటిలో రూ. 2585 కోట్లు నేరుగా లబ్దిదారులకు నేరుగా ఇవ్వగా … మిగిలినవి రూ. 843 కోట్లు మరికొన్ని పథకాల ద్వారా అందించామన్నారు. మైనార్టీలపై ట్విట్టర్లు, జూమ్ లలో ఎక్కడలేని ప్రేమను ఒకాయన చూపిస్తున్నారని..గతంలో మైనార్టీ మంత్రి లేరు.. ఎన్నికలకు ఆరు నెలల ముందు మైనార్టీ మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. హాజ్ యాత్రకు వెళ్లేవారి కోసం చేసే ఆర్ధిక సాయాన్ని  30-60 వేలకు పెంచామని..ఇమామ్ లకు 5వేలు, మౌజుమ్ లకు 3 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని…మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తున్నానని సీఎం జగన్‌ చెప్పారు.

Related posts