త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు పెరిగిపోతున్నాయి. మరోవైపు మంత్రులు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు.ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఎవరూ పార్టీ మారరని ఆమె పేర్కొన్నారు.
మంత్రులు పార్టీ మారబోతున్నారనే వార్త కేవలం దుష్ప్రచారం మాత్రమేనని అన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు రాని వారు పార్టీ మారడం సహజమేనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ధైర్యంగా వెళ్లి ఓట్లు అడుగుతామని చెప్పారు. టెకెట్ల విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. తమ సీట్ల పై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మంత్రులంతా భజనపరులు..భట్టి తీవ్ర విమర్శలు!