తమిళంలో శృంగారతారగా ఇమేజ్ తెచ్చుకున్న సోనా… చివరిగా గతేడాది ప్రశాంత్ హీరోగా వచ్చిన ‘జానీ’లో సోనా కనిపించింది. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. ఐటమ్ సాంగ్స్‌లోనూ అలరించిన ఆమె తాజాగా మలయాళంలో ‘పచ్చమాంగా’ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ‘పచ్చమాంగా’ ట్రైలర్ విడుదలైంది. అందులో సోనా గ్లామరస్ నటన చూసినవారు సోనా కూడా షకీలా బాటలో వెళ్తున్నట్లు విమర్శించారు. దీనిపై సోనా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. బాలుమహేంద్ర సినిమాల తరహాలో ‘పచ్చమాంగా’ ఒక క్లాసికల్ మూవీ అని, ట్రైలర్‌లో కొన్ని సెకన్లు గ్లామరస్‌గా కనిపించిన తన పాత్రను చూసి సినిమా అంతా అలాగే నటించినట్లు భావించొద్దని చెప్పారు. కేరళలో మహిళల వస్త్రధారణనే తాను అనుసరించానని, దయచేసి తనను శృంగారతారగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని సోనా విజ్ఞప్తి చేశారు. ఇకపై అలాంటి పాత్రలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
next post
జీవితాలతో చెలగాటాలాడొద్దు ప్రకాష్ రాజ్..