telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం ..ఇదే ఫస్ట్ టైం

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుద‌ల‌ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖ రాశారు. ఒక పక్క కరోనా బీభత్సం, మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉద్యోగ సంఘాలకు కోరారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల తాజా పరిస్థితి తాను ఇప్పటి వరకూ ఎప్పుడు ఎక్కడ చూడలేదని, ఉద్యోగస్తులకు కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల 10,247 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంటే.. ‘‘మాకు పెంచిన జీతాలు వద్దు, పాత జీతాలే చాలు’’ అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి..

ఇలాంటి పరిస్థితి తానెప్పుడూ చూడలేదని, జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేయటం చూశాను.. అంతేకానీ మాకు పెంచిన జీతాలు వద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం బహుశా ఇదే ప్రధమం అనుకుంటానని ఉండవల్లి అన్నారు.

ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంది..మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు సమ్మెను ఆపవలసిందిగా ప్రార్ధిస్తున్నానని చెప్పారు. జగన్ ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు.. పట్టింపులకు పోకుండా, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించవల్సిందిగా ఉండవల్లి అరుణ కుమార్ లేఖ‌లో కోరారు.

Related posts