telugu navyamedia
క్రీడలు వార్తలు

టీంఇండియా పై అక్తర్ ప్రశంసలు…

Shoaib Akthar Pakistan

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగలదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయంతో అడిలైడ్ లోని ఘోర ఓటమి నుండి బౌన్స్ భారత ఆటగాళ్లు చాలా కృషి చేసారు అని అన్నాడు. అలాగే భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ అయిన అజింక్య రహానే ‌పై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో టెస్టులో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, రోహిత్ శర్మ లేకుండా భారత జట్టు ఆడింది. అలాగే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో ఉమేష్ యాదవ్‌ దూరమయ్యాడు. కానీ ఈ సమయంలో కూడా  రహానే జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు అని తెలిపాడు. ఈ సిరీస్ లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో రాణిస్తే చాలు, ఈ సిరీస్‌ గెలవడం భారత జట్టుకు చాలా సులభం” అని షోయబ్ అక్తర్ అన్నారు. రవిశాస్త్రి, అజింక్య రహానె మరియు జట్టు గురించి మీరు ఏమి చెప్పినా, భారతదేశం యొక్క బలం మైదానంలో ఆడుతున్న వ్యక్తులు కాదు, ఇది బెంచ్ బలం. వారు అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడకు వెళ్లి మంచి ప్రదర్శన ఇచ్చారు. ఒక టెస్టులో దెబ్బతినడం మరియు తరువాత తిరిగి వచ్చి తదుపరి టెస్ట్ గెలవడం జట్టు యొక్క లక్షణాన్ని చూపిస్తుంది అని అక్తర్ అన్నాడు. చూడాలి మరి మూడో టెస్టులో విజయం ఎవరిది అనేది.

Related posts