దేశంలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా నటి సిఖా మల్హోత్రాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. షారూక్ ‘ఫ్యాన్’ చిత్రంలో నటించిన సిఖా బీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఓ ఆసుపత్రిలో నర్సుగా వాలంటరీ సేవలు అందించారు. గత ఆరు నెలలుగా ఆమె ఆ ఆసుపత్రిలోనే పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సిఖా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఇక ఈ వైరస్‌పై అందరిలో అవగాహన పెరగాలని, కరోనాను సీరియస్‌గా తీసుకోవాలని, కుదిరినంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. మరోవైపు ఆమె పోస్ట్‌కి స్పందించిన అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
previous post