telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ బంధువులు కిడ్నాప్..

హైద్రాబాద్ లో రాయలసీమ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. బోయినపల్లి లో సీఎం కేసీఆర్ సమీప బందువులు ముగ్గురు కిడ్నాప్ అయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో ఇన్ కంటాక్స్ అధికారులంటూ రైడ్స్ చేసిన దుండగులు… నకిలీ సర్చ్ వారెంట్, నకిలీ ఐడీ కార్డులు చూపించి హాల్ చల్‌ చేశారు కిడ్నాపర్లు. నకిలీ ఐటీ అధికారుల వేషంలో వచ్చిన కిడ్నాపర్లు… ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి వారి దగ్గర మొబైల్స్ ను లాగేసుకున్నారు. సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ రావు ను హాల్ లో కూర్చుబెట్టి విచారణ చేస్తున్నట్లు నటించిన దుండగులు.. సెర్చ్ వారెంట్ ను సైతం కుటుంబ సభ్యులకు చూపించారు కిడ్నాపర్లు.
ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను బెడ్ రూమ్ లో బంధించిన కిడ్నాపర్లు… 8.40 నిమిషాలకు ఇంటికి చేరుకుంది కిడ్నాప్ కు గురైన సునీల్ భార్య సరిత. ప్రవీణ్ రావు తల్లితో పాటు మిగిలిన సోదరులు కుటుంబ సభ్యులు ను గదిలో లాక్ చేసి ఉంచడంతో షాక్ కు గురైన సరిత… ఐటీ అధికారులమని వచ్చి మమ్మల్ని రూమ్ లో పెట్టారని చెప్పారు మిగిలిన కుటుంబ సభ్యులు. అప్పటికే ముగ్గురు ని కిడ్నాప్ చేసి ఇంటి నుండి ఎస్కేప్ అయిన కిడ్నాపర్లు… వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అలెర్ట్ అయ్యారు మూడు కమిషనరేట్ ల పోలీసులు. ఐటీ అధికారులను రైడ్ గురించి క్లారిటీ తీసుకున్న పోలీసులు..
అలాంటి రైడ్ ఏమి చేయలేదని చెప్పింది ఐటీ శాఖ. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రైడ్ చేసే సమయంలో భార్గవ్ పేరు ఎత్తిన ఓ కిడ్నాపర్… విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు కుటుంబ సభ్యులు. ఇంటి వాచ్ మెన్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కిడ్నాపర్లు
నార్సింగి లోని మై హోమ్ అవతార్ అపర్ట్స్మెంట్ వద్ద ముగ్గురిని వదిలి పారిపోయారు. అక్కడి నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు ప్రవీణ్ రావ్ అతని సోదరులు. వికారాబాద్ సమీపంలో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హఫీజ్ పేట్ లాండ్ వివాదమే కిడ్నాప్ కు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలుసులు… కిడ్నాప్ వెనుక ప్రధాన సూత్రధారి చంద్రబోస్ గా అనుమానిస్తున్నారు. చంద్రబోస్ భార్గవ్ సోదరుడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Related posts