telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మూగ్గురితో మజా చేసి .. దొరికిపోయిన .. షేన్ వార్న్..

shanewarn with 3 women caught viral

షేన్ వార్న్ ప్రేమికురాలితో పాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను ఏకంగా ఇంటికే పిలిపించుకుని రాసలీలల్లో మునిగిపోయాడు. తలుపులు బార్ల తెరుచుకుని మరీ నానా హంగామా చేసి ఇరుగుపొరుగుకు ఇబ్బంది కలిగించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పత్రిక కధనం ప్రకారం.. ఈస్ట్ లండన్‌లో ఉన్న తన ఇంటికి వార్న్ తన లవర్‌తోపాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లు డవీనా (19), పాపీ (27)లను పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తలపులు తెరిచే ఉంచడంతో లోపల జరుగుతున్న తతంగం మొత్తం పక్కింటి వారి కళ్లకు కట్టింది.

చెవులు చిల్లులు పడే మ్యూజిక్‌తోపాటు పార్టీ సందర్భంగా చేసిన గ్లాసుల గలగలలతో ఇరుగురు పొరుగుకు నిద్ర కరవైంది. అనంతరం యువతులు ముగ్గురూ వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు వార్న్ చెప్పులు లేకుండానే కారులో వెళ్లిన ఫొటోలు బయటకు వచ్చాయి. వార్న్ తీరుపై పొరిగింటి వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చర్యల వల్ల ఇరుగు పొరుగు ఇబ్బంది పడతారన్న కనీస జ్ఞానం కూడా వార్న్‌కు లేకపోయిందని మండిపడ్డారు. వార్న్ ఇంటి పక్కన గౌరవ ప్రదమైన కుటుంబాలు ఉన్నాయని, కనీసం కిటికీ తలుపులు కూడా వేసుకోకుండా పార్టీలంటూ హడావిడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts