telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 తెలుగు : .. ఈవారం ఎలిమినేషన్ లేనట్టేనా..

no elimination this week in bigg boss 3 telugu

ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కు నాగార్జున దూరం కాగా, కార్యక్రమాన్ని నడిపించే బాధ్యతను రమ్యకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వారంలో పునర్నవి, హిమజ, మహేశ్ ఎలిమినేషన్ లో నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, నాగ్ గైర్హాజరీలో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండదని తెలుస్తోంది.

ఈ వారానికి ఎలిమినేషన్ ఉండదని, రమ్యకృష్ణ ద్వారా చెప్పిస్తూ, ఇప్పటికే నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇక అసలు విషయం తెలియాలంటే, నేటి రాత్రి వరకూ ఆగక తప్పదు.

Related posts