బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ గురించి 15 రోజుల క్రితమే అధికారులకు ఉప్పందినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఇలా సెలెబ్రిటీల పిల్లలు ఉంటారని వారు ఊహించలేదని సమాచారం. ఈ క్రమంలో షారుఖ్ తనయుడు సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఈ పార్టీలో దొరికిపోయారు.
విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను చెక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం, ఆర్యన్ తరచూ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చేవాడని తెలుస్తోంది. ముంబైలోని జేజే ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్ కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కుమారుడు అరెస్ట్ కావడంపై షారుఖ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు