telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కింగ్ గిఫ్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు…!

Nag

నాగార్జున ఇటీవల `బిగ్‌బాస్-3` సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో అలీరెజా కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో అలీరెజా చాలా స్టైలిష్‌గా ఉండేవాడు. అతని డ్రెస్సింగ్‌ను నాగార్జున కూడా చాలా ఇష్టపడేవారు. ఒక వీకెండ్ కార్యక్రమంలో నాగార్జున ధరించిన బ్రాండెడ్‌ షూ‌స్‌ను అలీ ఇష్టపడ్డాడు. అలాంటి షూ తనకు కావాలని నాగ్‌ను కోరాడు. కచ్చితంగా గిఫ్ట్ ఇస్తానని నాగ్ ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన విధంగా అలీరెజాకు నాగ్ తాజాగా గిఫ్ట్‌ పంపించారు. నాగార్జున గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. `నిజంగా మాట మీద నిలబడే మనిషి. తన ఫేవరెట్ బ్రాండ్ షూస్‌ను నాగార్జున నాకు గిఫ్ట్‌గా పంపించారు. అలాంటి షూస్ కావాలని బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాగార్జునగారిని కోరాను. మాట ఇచ్చిన విధంగా నాకు ఇప్పుడు పంపించారు. లవ్యూ నాగార్జున సర్` అంటూ అలీ ట్వీట్ చేశాడు. నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts