telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నాగ చైతన్య ?

Akkineni

యాక్షన్ కింగ్ అర్జున్‌ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల నాగ చైతన్యను కలిసిన అర్జున్ అతడికి ఓ కథను వినిపించారట. యాక్షన్‌ కథాంశంతో కూడిన ఆ కథ చైతూకు బాగా నచ్చిందట. ఫుల్‌ స్క్రిప్ట్‌తో రావాలని ఆయనకు సూచించారట. ఒకవేళ ఫుల్‌ స్క్రిప్ట్‌కి చైతూ ఓకే చెప్తే.. వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. నటుడు అర్జున్ మల్టీటాలెంటెడ్‌ హీరో. నటుడిగా వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. మరోవైపు సింగర్‌గానూ, నిర్మాతగానూ గుర్తింపు సాధించుకున్నారు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ హీరోగా తెరకెక్కిన లవ్‌ స్టోరీ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉంది. ఈ మూవీ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యు అనే మూవీలో చైతూ నటించనున్నారు.

Related posts