telugu navyamedia
సినిమా వార్తలు

70 కోట్లు కొల్లగొట్టిన “ఎఫ్-2” 

F2
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మింతమైన ఈ చిత్రం ఇప్పటికి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలివారమ ప్రపంచవ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోందని చిత్రబృందం తెలిపింది. నిర్మాత దిల్ రాజు గత ఏడాది వరుస అపజయాలతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మొదట్లోనే F2 తో మంచి లాభాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా డిమాండ్ పెరిగింది. అంతేకాదు అనిల్ రావిపూడి తన కొత్త సినిమాలకు పారితోషికం కూడా పెంచినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ నటనకు మంచి మార్కులు పడగా తమన్నా, మెహ్రీన్ లు తమ గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయ్యారు. 

Related posts