telugu navyamedia
సామాజిక

సీతమ్మ అందాలు వేరు, శ్రీరాముడి అందాలు వేరు, కన్ఫ్యూజ్ కావొద్దు

కృత్రిమ మేధ సరే!
మన బుర్ర కేమయ్యింది ?
“నగుమోము కలవాడు .. నా మనోహరుడు” .. అన్నాడు త్యాగయ్య ..
అక్కడితో ఆగాడా ?
లేదు ..
” జగమేలు సూరుడు .. జానకి వరుడు” అన్నాడు .
ఇంకో చోట ..
” చందురు వర్ణుడు .. అందచందములు కలవాడు” అన్నాడు .
ఇది అలా ఉంచండి .
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ గీసిన శ్రీరాముడు చిత్రం అంటూ ఇటీవల ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది . వాల్మీకి రామాయణాన్ని చదివిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మనిషి సాయం లేకుండా శ్రీరాముడి చిత్రం గీసిందట .
ఆ చిత్రాన్ని చూడడం తోటే నాకు ఇదేదో మోసపూరితం అనిపించింది .
వైరల్ అవుతున్నప్పుడు చెబితే బాగోదు .. జనాలు అపార్టం చేసుకొంటారని ఊరుకున్నా .
కనీసం ఇప్పుడైనా చెప్పకపోతే సరికాదు

పురుషుడికి స్త్రీకి ముఖాకృతిలో తేడాలేంటి ?
1 దవడ రేఖ : పురుషుడి దవడ రేఖ విస్తృతంగా, స్పష్టంగా ఉంటుంది .
స్త్రీ దవడ రేఖ సున్నితంగా , గుండ్రంగా ఉంటుంది .
ఒక సారి ఫోటో చూడండి . పురుషుడి దవడ రేఖ లా ఉందా? లేక స్త్రీ దవడ రేఖ లా ఉందా ?

2 చెంప లు : పురుషుడి చెంపలు చదునుగా ఉంటాయి .
స్త్రీ చెంపలు గుండ్రంగా పెద్దవిగా ఉంటాయి . స్త్రీ దవడ ఎముకలు పురుషుడి తో పోలిస్తే పెద్దవి .

ఇప్పుడు చితం లోని చెంపలు ఒక సారి చెక్ చేయండి .

3 ముక్కు : పురుషుడి ముక్కు పొడవుగా పెద్దదిగా ఉంటుంది .
స్త్రీ ముక్కు చిన్నదిగా, సున్నితంగా ఉంటుంది .
ఒక సారి ఫోటో చెక్ చేయండి .

4 నుదురు : పురుషుడు నుదురు విశాలంగా ఉంటుంది . కనుబొమలు పెద్దవిగా ఉంటాయి .
స్త్రీ నుదురు చిన్నదిగా, కనుబొమలు స్మూత్ గా ఉంటాయి .

మరో సారి చిత్రాన్ని చెక్ చెయ్యండి .

చివరి పాయింట్ . కీలకమయిన పాయింట్ .
5 పెదాలు ; పురుషుడి పెదాలు సన్నంగా ఉంటాయి .
స్త్రీ పెదాలు నిండుగా ఉంటాయి .
చిత్రాన్ని ఇంకో సారి చూసుకోండి .

గ్రహించరా ?
చిత్రంలో వున్నది స్త్రీ పోలికలు అని ఒప్పుకొంటారా ?
శ్రీరాముడు యోధుడు . 21 సంవత్సరాల కల్లా విలువిద్యలో ఆరితేరి , రాక్షసుల్ని సంహరించి , శివ ధనుస్సు ను విరిచిన అరి వీర భయంకరుడు .
ఆంగ్ల మాటల్లో చెప్పాలంటే స్రీలు బ్యూటిఫుల్ . పురుషులు హ్యాండ్సమ్ .
రెండూ ఒకటే కాదు .
తెలుగు లో రెంటికి అందం అనే ఒకటే పదం ఉండొచ్చు .
కానీ పురుషుడి అందం వేరు .. స్త్రీ అందం వేరు. కాదంటారా ?
మరి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తప్పేలా చేసింది అంటారా ?
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మెషిన్ అంటే ఎక్కడిది ? ఏదైనా సమాచారం వచ్చిందా ? లేదే . జస్ట్ ఒక మెసేజ్ . రోబో గీసింది అంటే జనాలు వైరల్ చేసేసారు . అది ఎవరో ఆకతాయి చేసిన పని అని నా అనుమానం .
ఒక వేళా నిజంగానే అది ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ గీసుంటే దానికి బుర్ర లేదు .కృత్రిమ మేధకు బుద్ధి లేక పొతే మనకేమయ్యింది ?
అమ్మాయి బొమ్మ కు కాస్త మార్ఫింగ్ చేసి ఇదే రాముడు అంటే మీరు నమ్మేశారు . ఒక విధంగా ఇది రాముడికి అమమానం .

భక్తి కొద్దీ దాన్ని షేర్ చేసిన వారిది తప్పులేదు లెండి .
ఏదో చూడగానే తన్మయత్వం లో చేసేసారు .
ఇప్పుడైనా ఆలోచించండి .
టెక్నాలజీ పేరుతొ మనల్ని బురిడీ కొట్టించడానికి మాఫియా లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి . తస్మాత్ జాగ్రత్త .

దేవాది దేవుడు .. దివ్య సుందరుడు .. నిర్మలాకారుడు .. శ్రీరాముడు

 

Related posts