telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కడుపులో కాలే పేగులహోరు..

ఆకలి అలలు మోహన కొడుతుంటే
కడుపులో కాలే పేగులహోరు
చెవులలో గింగురుమంటుంటే
కూడులేకా,కాళ్ళలో నిలబడే శక్తి లేక
నీరసంతో దరిద్రం కొట్టిన పిట్టల్లా నేలరాలుతుంటే
జానెడు పొట్ట కోసం చేస్తున్నా యాచన ఇది
తల్లి ఎవరో
తండ్రి ఎక్కడో
అయినవారు లేరు
ఆదరించే వారు లేరు
తల్లి ఒడిని ఎరుగని అబాగ్యురాలికి
భూమాతే తల్లిఅవుతతుంటే
అలసిన దేహాన్ని మోసే అరుగే తండ్రవుతుంటే
కడుపే నిండక
డొక్క మాడుతుంటే
చేయి చాచి అడిగే సాయమే
ఈ యాచన
ఏ తల్లి తొందరపాటు తనమో
ఏ కాలం నింపిన విషమో
ఈ విధి ఆడిన చెలగాటమో
నిన్ను యాచించేలా చేస్తోంది
బడిబాట నడిస్తూ,
ఆశలు, ఆశయాలతో
దేశాన్ని నడిపించాల్సిన
భావి భారతం
పొట్టకూటికై యాచిస్తోంది
దేవుడికి పాపల కాసులనే వేసే జనులు
దేవుడంటి ఆకలి నీదైనా సాయం ఇవ్వని హీనులు
ఉన్న వాడికే వందరకలు
ఏమి లేని నీకు పస్తులు
నీ ఆకలి చూపులు ఎవరికి అర్థం కావులే
ఈ లోకమంతా ఉరకల పరుకుల్లే
నీ అడుగులన్నీ బాధల మడుగులే…..

Related posts