telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

లైకా కే తమిళ్ ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎటు చూసినా ఆర్ఆర్ఆర్ పేరు వినిపిస్తుంది.. ఈ సినిమాలో యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. వీరి పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన సినిమా టీజర్లు కూడా భారీ స్థాయి ఆదరణ పొందాయి. కానీ కరోనా వచ్చి అంతా తలకిందులు చేసింది. కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయిన ఆర్ఆర్ఆర్ సినిమా గతేడాది అక్టోబరులో షూటింగ్ తిరిగి ప్రారంభించి నిర్విరామంగా చిత్రిక‌రిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. కానీ ఇప్పటికే రెండు సార్లు సినిమా విడుదల డేట్‌ను మార్చిన జక్కన్న ఈ సినిమాను దసరాకు తీసుకురానున్నట్లు తెలిపారు. కాని కొందరు మాత్రం ఈ సినిమా దసరాకు రాదంటూ ట్రోల్ చేశారు. ఏది ఏమయినా ఈ సినిమాను దసరాకు తీసుకురావాలని రాజమౌళి అండ్ టీం నిర్ణయించుకుంది. అందుకేనేమో నిద్రాహారాలు మానేసి మరీ టీం పనిచేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా తమిళ్ థియేట్రికల్ రైట్స్ లైకా సంస్థ దకించుకుంది. ఇందుకోసం భారీ మొత్తంలో వెచ్చించిన‌ట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది అనేది.

Related posts