telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్”కు ఊహించని షాక్…!?

Jabardasth

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. ఈ షో కి ఇంతగా పాపులారిటీ రావడానికి తెరపై కనిపించే నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్స్ కామెడీ ఎంత ముఖ్యమో.. తెరవెనక దర్శకులకు కూడా అంతే ఉంటుంది. జబర్దస్త్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రియేటివ్ హెడ్స్ నితిన్-భరత్ ఇప్పుడు ఈ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు మరో ఛానెల్లో సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వచ్చే “పోవే పోరా” షో కొనసాగింపు విషయంలో కూడా మల్లెమాలతో ఈ హెడ్స్‌కు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ షో నుంచి వాళ్లు వాకౌట్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దాంతో ఇప్పుడు జబర్దస్త్ షో బాధ్యత అంతా నాగబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గతంలో కొన్ని సీరియల్స్ కూడా రాసిన అనుభవం నాగబాబు సొంతం. దాంతో ఇప్పుడు షోపై నాగబాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోలో బాగా లావుగా వున్న ఇద్దరు ముగ్గురు కమెడియన్లకు వెంటనే బరువు తగ్గాలని నాగబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పట్నుంచి షో స్కిట్స్ కూడా మరింత పదునుగా నవ్వించేలా ఉండేలా నాగబాబు ప్లాన్ చేస్తున్నాడు. మరి కియేటివ్ హెడ్స్ లేకుండా ఈ షోను ఎలా నడిపించబోతున్నారో చూడాలి.

Related posts