వివాదాస్పద దర్శకుడు ఏపీలో సినిమా టిక్కెట్లు ధరల తగ్గింపు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొద్ది రోజులుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానితో వర్మకు ట్విట్టర్ వార్ నడిచింది. ఇద్దరూ తమ తమ పాయింట్స్ తో ట్విట్టర్ వేదికగా వాదనకు దిగారు.
సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. మంత్రి పేర్ని నాని కూడా ఏమాత్రం తగ్గలేదు. పది ప్రశ్నలకు తోడుగా మరో పది ప్రశ్నలను వేస్తూ బదులిచ్చారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి మాట్లాడుకుందాం అంటూ సోషల్ మీడి యా వార్ కు చెక్ పెట్టారు.
తాజాగా.. వర్మ గురువారం రాత్రి సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ పోస్ట్ చేశాడు.. ఈ ట్వీట్స్ లో సీఎం జగన్ ని పొగుడుతూనే..వైసీపీ పార్టీలోని ముఖ్య నాయకులపై విమర్శలు చేశాడు.
“వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్ జగన్… చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్ ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్… నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్ తో జాగ్రత్తగా ఉండు”..
మీ పట్టుదల ప్రవర్తనను చూసి మిమ్మల్ని ఇష్టపడి నా తల్లి నా సోదరి మీకు ఓటు వేశారు…కానీ మీ చూట్టూ ఉంటూ మీ ఇమేజ్‌ని పాడు చేస్తున్నా వారిని చూసి షాక్ అవుతున్నారని వర్మ ట్వీట్ చేశారు. అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో ఏపీ సీఎంను హెచ్చరించారు వర్మ.
ఆ వార్తలు నిరాధారం : కరీనా కపూర్