telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొత్త భిక్షగాళ్లు కనుమరుగు..

కొత్త బిక్షగాళ్లు చరిత్రలో కనుమరుగవుతారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున సామాజిక సేవాకార్యక్రమాలను లబ్ధిదారులకు చేరువచేశారు.

రాష్ట్రం రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. జనసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో దిగాలని సూచించిన పార్టీశ్రేణుల విన్నపానికి చంద్రబాబు ప్రతిస్పందించారు. పరిస్థితుల్ని బట్టి పొత్తులు ఏర్పడుతాయన్నారు. రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి…. చరిత్రలో తెలుగుదేశంపార్టీకి క్రెడిబిలిటీ ఉందనీ, పొత్తులతోనూ… పొత్తుల్లేకుండా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పొత్తులతో ఓడిపోయిన నేపథ్యం లేకపోలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పొత్తులు… ఎత్తులు ఉంటాయన్నారు. రాష్ట్ర పరిస్థితి దృష్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. జగన్ మోహన్ రెడ్డి …ప్రజలు దయతలచి ఒక్క ఛాన్స్ అడిగారు ఇచ్చారు… ఆయన రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు..

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమం పనులు చేశామన్నారు… వైకాపా నేతలకు ప్రజలు త్వరలో చెవుల్లో పూలు పెట్టే రోజులు వస్తాయన్నారు… జగన్ ఒక విధ్వంసకారని పేర్కొన్నారు…. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ ఉంది… అన్న క్యాంటిన్ ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. ప్రజల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ జాగీరు కాదనే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు…

కోవిడ్ వల్ల ఎపి ఆదాయం తగ్గలేదు… జగన్ పరిపాలనా చేయకపోవడం వల్ల ఆదాయం తగ్గిందని చంద్రబాబునాయుడు విశ్లేషించారు… జగన్ తీరుతో వైకాపా శ్రేణులు బాదితులుగా ఉన్నారని తెలిపారు….
పుంగనూరు ఎలా పెద్దిరెడ్డి గెలుస్తాడు చూస్తానని చంద్రబాబునాయుడు శపథం చేశారు… కుప్పంతో ఎప్పుడూ ఎమోషన్ ఎటాచ్ మెంట్ ఉంటుంది .. కుప్పంలో తిరుగులేని విజయాన్ని ప్రజలు అందిస్తారనే విశ్వాసం వ్యక్తంచేశారు.

Related posts