డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా తన పూరి మ్యూజింగ్స్‌లో ‘విజయం’ అనే టాపిక్ మీద మాట్లాడారు. “జీవితంలో కొన్నిసార్లు నిరాశకు గురవుతాం. సక్సెస్ రావడం లేదని బాధపడుతుంటాం. అందరూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. నేను మాత్రం ఏమీ సాధించలేకపోయానని బాధపడుతుంటాం. అయితే ముందుగా మనం పుట్టుక గురించి ఆలోచించాలి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది పుట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రోజూ కొన్ని కోట్ల వీర్య కణాలు వృథాగా పోతుంటాయి. కానీ, మీరు ఎన్నింటినో అధిగమించి ఈ భూమి మీదకు వచ్చారు. పుట్టుకతోనే మీరు విజేత. పుట్టడానికే బోలెడు యుద్ధాలు చేసిన మీకు సక్సెస్ ఒక లెక్కా? సక్సెస్ మీ డిఎన్ఏలోనే ఉంది. అది మీ ఇంటి పేరు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది సక్సెస్. ఎప్పుడూ నిరాశ చెందకూడదు” అని పూరీ చెప్పుకొచ్చారు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో పలు అంశాలపై తరచుగా ఆయన తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. ప్రతి టాపిక్ పై ఆయన అభిప్రాయాన్ని సూటిగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు. అవి యువతకు డిప్రెషన్ ను తగ్గించి స్ఫూర్తిని నింపేలా ఉండడం హర్షించదగ్గ విషయం.
previous post
next post