telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛీ..అలాంటి పనులు చేయను

కథానాయికగా లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ తదితర విజయవంతమైన చిత్రాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆమె నటించారు. నటిగా చక్కటి పేరు సొంతం చేసుకున్నారు. దాంతో వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’. తాజాగా.. లావణ్య త్రిపాఠి ఓ ఆఫర్‌ కాదన్నదట. తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయమని కొన్ని లిక్కర్‌ కంపెనీలు ఈ భామ ని సంప్రదిస్తే నిర్మొహమాటంగా “నో” చెప్పేసిందట. ” వాటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తే వాణిజ్య ప్రకటనల కంటే మంచి డబ్బులు అందుతాయి. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయంలో నా మనసు మారదు” అని లావణ్య త్రిపాఠి స్పష్టం చేసిందట.

Related posts