telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే..రాజ్‌గోపాల్ ఆర్ జి పాల్ అని పిల‌వాలి

*మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు కీల‌కం
*రాజ్‌గోపాల్ ఆర్ జి పాల్ అని పిల‌వాలి..
*టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే

గాంధీభవన్‌లో అనుబంధ సంఘాల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని RG పాల్ అని పిలవాలని రేవంత్ సూచించారు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని పిలిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తామని సభలు, సమావేశాల్లో కూడా RG పాల్ అని పిలవాలని ఆదేశించారు రేవంత్‌రెడ్డి.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే అని, ఇరు పార్టీల నేతల మధ్య ఒప్పందం లేకుండానే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను కేవలం 5 నిమిషాల వ్యవధిల్లోనే ఆమోదిస్తారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఉప ఎన్నికకు అంత తొందర ఏముందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో టీఆర్ఎస్‌కు అవసరమని, ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక బీజేపీకి అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts